Gmail Calendar Documents Reader Web more »
Recently Visited Groups | Help | Sign in
Google Groups Home
Group info
Members: 1899
Language: Telugu
Group categories:
Arts and Entertainment > Literature
Region: Asia > India
More group info »
Recent pages and files
policy    

ఈ సమూహానికి సందేశాలు పంపేముందు...


మనందరం కంప్యూటర్లో తెలుగు చూడగలిగి, తెలుగు బ్లాగులని చదువుతూ ఆనందిస్తున్నాం. కానీ ఇంకా కంప్యూటర్లో తెలుగుని చూడవచ్చని తెలియనివాళ్ళూ, తెలిసినా దానికోసం కంప్యూటర్ని ఎలా సిద్ధం చేయాలో తెలియనివాళ్ళూ చాలామంది ఉన్నారు. తెలుగు బ్లాగుల గురించి కూడా తెలియనివారూ ఉన్నారు. వారందరినీ చేర్చేందుకు మనంచేసే ప్రయత్నాల్ని సమీకృతం చేసేందుకు ఈ గుంపునొక వేదికగా వాడదాం. ఈ క్రింది సూచనలని విధిగా పాటిద్దాం:

  • మీ సందేశాలను తెలుగులోనే పంపించండి.
  • మీరు కొత్త బ్లాగును మొదలుపెట్టారా? అయితే మొదటిసారి మీ బ్లాగు చిరునామాని గుంపుకు పంపవచ్చు.
  • మీ బ్లాగులో కొత్త టపా రాసారా? ఆ సంగతి గుంపుకు పంపకండి. కూడళ్ళలో అదెలాగూ వస్తుంది.
  • మీ సందేశం (బ్లాగులకు సంబంధించినదై ఉండి) అధిక శాతం సభ్యులకు ఉపయోగపడుతుందనుకుంటున్నారా? అయితే గుంపుకు పంపండి.
  • కొద్దిమంది సభ్యులకి మాత్రమే సందేశం పంపాలనుకుంటే, ఆయా సభ్యులకు వ్యక్తిగతంగా పంపించండి, గుంపుకు వద్దు.
  • సభ్యులు అడిగిన సాంకేతిక లేదా ఇతర సమస్యలకు మీరు సూచించే పరిష్కారాన్ని గుంపుకే పంపండి. అది ఇతర సభ్యులకు కూడా ఉపయోగపడవచ్చు.
  • ఫార్వర్డు చేసిన సందేశాలు అన్నీ దాదాపుగా కాలక్షేపానివే. వాటిని ఈ గుంపుకు పంపవద్దు.
  • కవితలు, పాటలు, వ్యాసాలు తదితరాలపై చర్చలు మొదలైనవాటిని ఈ గుంపుకు పంపవద్దు. అందుకోసం సాహిత్యం (sahityam@googlegroups.com) అనే ప్రత్యేక గుంపు ఉంది. దానిలోనూ దాదాపుగా తెలుగు బ్లాగర్లందరూ సభ్యులే.
  • శుభాకాంక్షలు లేదా ఇతర అభినందన సందేశాలు వ్యక్తిగతమైనవి; వాటిని గుంపుకు పంపవద్దు. మీ అభినందనలు అందరికీ తెలియాలంటే మీ బ్లాగులో రాయండి.

ఎటువంటి సందేశాలు గుంపుకు పంపవచ్చు అనేది, ఈ సమూహపు లక్ష్యాలను అనుసరించి నిర్ణయించుకోవచ్చు. ఈ గుంపు యొక్క ప్రధాన లక్ష్యం ఇది:

తెలుగులో బ్లాగులు రాయాలనుకునే ఔత్సాహికులకు, బ్లాగుని ప్రారంభించడంలోనూ దాన్ని కొనసాగించడంలోనూ తోడ్పాటునందించడం

ఈ ప్రధాన లక్ష్యానికి అనుబంధ లక్ష్యాలుగా వీటిని చెప్పుకోచ్చు:

  • కంప్యూటర్లో తెలుగు చూడడం మరియు రాయడంలో ఉన్న ఇబ్బందులకు, సమస్యలకు పరిష్కారాలు సూచించడం
  • భాషాపరమైన సందేహాల నివృత్తి (వాడుకపరమైనవే, సాహిత్యపరమైనవి కాదు)
  • వెబ్ లో తెలుగుని విస్తృతం చేయడం
Version: 
Latest 3 messages about this page (5 total) - view full discussion
Oct 1 2007 by చదువరి
http://groups.google.com/group/telugublog/web/policy - ఈ లింకును
నొక్కండి. లేదా ఈ లింకును కాపీ చేసి మీ బ్రౌజరులో అతికించి ఎంటరు నొక్కండి
Jun 11 2007 by Kiran Kumar Chava
రావు గారు చెప్పినట్టు మీరు ముందు మొదలెట్టండి మేమంతా మీ వెనకే ఉన్నాము!
ఇహ పోతే పరిచయాల విషయంలో మీ అంతరాత్మ ప్రభోధానుసారం నడచుకోండి
Jun 11 2007 by cbrao
మీరు మొదలు పెట్టండి. మిగతావారు అందులో చేరుతారు. కాని చేరేవారికి మీ పై నమ్మకం
కలగాలంటే, మొదటగా మీ పరిచయం ఇవ్వాలి.
2 more messages »
Create a group - Google Groups - Google Home - Terms of Service - Privacy Policy
©2009 Google